ఏడేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు | Molestation On Seven Years old Child In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు

Nov 10 2018 11:01 AM | Updated on Nov 10 2018 11:01 AM

Molestation On Seven Years old Child In Tamil Nadu - Sakshi

పాఠశాలను ముట్టడించిన బంధువులు, ప్రజలు

తిరువొత్తియూరు: చిన్నారిని లైంగికంగా వేధించిన అన్నాడీఎంకే నేతను ప్రజలు చితకబాది పోలీసులుకు అప్పగించారు. వివరాలు.. తిరుచ్చి ఆళ్వార్‌ తోటలో కాయిదేమిల్లత్‌ మాధ్యమిక ఎయిడెడ్‌ పాఠశాల ఉంది. ఈ పాఠశాల కరస్పాండెంట్‌ మీరాన్‌మైదీన్‌కి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన పాఠశాల కార్యదర్శి సలీమ్‌ (50) కరస్పాండెంట్‌గా ఉన్నాడు. ఇతను 49వ మండల అన్నాడీఎంకే కార్యదర్శిగానూ పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికను సలీమ్‌ రోజూ తన గదికి పిలుచుకుని లైంగికంగా వేధించేవాడని తెలిసింది. గురువారం కూడా బాలికను లైంగికంగా వేధించగా ఆ బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రజలు శుక్రవారం పాఠశాలకు వెళ్లి సలీమ్‌కి దేహశుద్ధి చేశారు. సమాచారంతో పోలీసు సహాయ కమిషనర్‌ రామచంద్రన్, సీఐ శివ సుబ్రమణ్యం సలీమ్‌ను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement