సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు | Missing Case Registered At Saroornagar Police Station | Sakshi
Sakshi News home page

సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

Oct 15 2019 6:22 PM | Updated on Oct 15 2019 6:22 PM

Missing Case Registered At Saroornagar Police Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చేవూరి విద్యాసాగర్‌ రావు అనే వ్యక్తిపై రాచకొండ కమిషనరేట్‌ సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మిస్సింగ్‌ కేసు నమోదైంది. కాగా ఈ నెల 10 నుంచి విద్యాసాగర్‌ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌ నగర్‌లోని బాపూ నగర్‌లో ఉంటున్న విద్యాసాగర్‌ రావు ఇద్దరు పిల్లలు. భార్య ఉపాద్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తనకు అవమానం జరిగిందని దీంతో తీవ్రంగా ఆవేదన చెందాడనీ.. ఆ తర్వాత అప్పుడప్పుడు మతిస్థిమితం తప్పినట్టుగా ప్రవర్తిస్తుంటాడని కుటుంబసభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యులు ఓ పెళ్లి వివాహానికి వెళ్లి వచ్చే తండ్రి ఇంట్లో కనింపించడం లేదని, తమ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలను పరిశీలిసంచగా కొత్తపేటలో చివరిసారిగా కనిపించాడని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 9703521011 నెంబర్‌కు గానీ, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దీనిపై ఫిర్యాదు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement