ప్రేమికుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం.. | Married Woman Commits Suicide Attempt With Lover in Srikakulam | Sakshi
Sakshi News home page

యువ జంట ఆత్మహత్యాయత్నం

May 11 2019 2:07 PM | Updated on May 11 2019 2:07 PM

Married Woman Commits Suicide Attempt With Lover in Srikakulam - Sakshi

చికిత్స పొందుతున్న మంజుల, వెంటిలేటర్‌పై ఉన్న వెంకటేశ్‌

ఇరువురి మధ్య ప్రేమే కారణం?

మందస: వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమకు దారితీసింది.  ఇంతలో యువతికి  వేరొకరితో వివాహామైన ఈ ప్రేమను కొనసాగించారు. ఈ సమస్యను ఇంట్లో చెప్పుకోలేక,  ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారు. మందస పట్టణంలో శుక్రవారం ఈ ఘటన సంచలనం కలిగించింది. క్రిమిసంహారక మందు తాగి∙ఒకేచోట పడి ఉన్న యువజంటను వారి కుటుంబ సభ్యులు గుర్తించి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మందస పట్టణంలో కాపువీధికి చెందిన బతకల మంజుల, పొందర వీధికి చెందిన పొందర వెంకటేశ్‌ల మధ్య స్నేహం చిగురించింది.

ఇది ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం మంజులకు ఇదే మండలానికి చెందిన కొత్తకమలాపురం గ్రామానికి చెందిన సింహాచలంతో వివాహామైంది. అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిన మంజుల, వెంకటేశ్‌ను శుక్రవారం మధ్యాహ్నం మందసలోని తోటలో కలిసింది. ఈ క్రమంలో క్రిమిసంహారక మందు సేవించిన వీరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి పలాసలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంకటేశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. అయితే మంజులకు మేజరు కాకుండానే వివాహం చేసినట్లు తెలుస్తోంది. మందస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement