రేపు దుబాయ్‌ వెళ్లాల్సి ఉండగా..

Man Was Kidnapped In Renigunta - Sakshi

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. బుధవారం రోజున దుబాయ్‌ వెళ్లాల్సిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడు. రేణిగుంటలో బైక్‌ మీద వెళ్తున్న ముగ్గురిపై గుర్తుతెలియని దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బైక్‌ను దహనం చేసి ఖాదర్‌ బాషా అనే యువకుడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు.

ఖాదర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కారం పొడి దాడి నుంచి తేరుకునే లోపే దుండగులు పారిపోయారు. దాదాపు నిన్న(మంగళవారం రాత్రి) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్‌నకు గురైన ఖాదర్‌ బాషా బుధవారం రోజున దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top