100 కత్తి పోట్లు.. తల నరికి.. గుండె కోసి..

Man stabbed over 100 times, beheaded, heart cut off, later buried in a US park - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని రౌడి ముఠా ఓ వ్యక్తిని బుధవారం అతి కిరాతకంగా హతమార్చి పబ్లిక్‌ పార్కులో పాతి పెట్టింది. ఈ ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాలు విస్తుపోయాయి. దాదాపు 100 కత్తి పోట్లు వ్యక్తి శరీరంపై ఉన్నట్లు మాన్‌ట్గోమెరీ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ హత్యను అల్ట్రా వైలెంట్‌ లాటినో స్ట్రీట్‌ గ్యాంగే చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఇప్పటివరకూ ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన వ్యక్తి తల నరికేశారని, గుండెను కోసి బయటకు తీశారని తెలిపారు. ఈ హత్యకు కొన్ని వారాల నుంచి కుట్ర పన్ని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అల్ట్రా వైలెంట్‌ లాటినో స్ట్రీట్‌‌, మారా సల్వట్రుచా(ఎంఎస్‌-13) అనే గ్యాంగ్‌లు అమెరికాలో ప్రమాదకరంగా మారాయి.

ఈ రెండు గ్రూపులను కూకటివేళ్లతో సహా పెకలిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు మార్లు చెప్పారు. ఎంఎస్‌-13లో దాదాపు 10 వేల మంది గ్యాంగ్‌స్టర్‌లు ఉన్నట్లు సమాచారం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top