పాతబస్తీలో దారుణం: కత్తిపోట్లకు దారితీసిన వాగ్వాదం | Man Murdered In Kalapathar Pathabasthi | Sakshi
Sakshi News home page

Dec 25 2018 8:30 AM | Updated on Dec 25 2018 1:32 PM

Man Murdered In Kalapathar Pathabasthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం వారిలో ఒకరి మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ కాలా పత్తార్‌ పరిధిలోని ఓ గుర్రపు శాల వద్ద మహ్మద్‌ అమీర్‌, సలీం మొసిన్‌ల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. అమీర్‌, మొసిన్‌పై కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే మొసిన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మొసిన్‌ మృతి చెందారు. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement