ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్‌.. రూ.4లక్షలు మాయం

Man Loses 4 Lakhs Due To calls customer Care Of Food Delivery Platform In Lucknow - Sakshi

లక్నో : ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌ చేసి ఓ యువకుడు రూ.4లక్షలు మోసపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. పుడ్‌ క్వాలిటీ సరిగా లేదని ఆర్డన్‌ను క్యాన్సిల్‌ చేసుకునే క్రమంలో రూ.4లక్షలు పోగొట్టుకున్నారు. విరరాలు.. లక్నోలోని గొమ్తినగర్‌ కు చెందిన ఓ యువకుడు బుధవారం ఓ ప్రముఖ పుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా పుడ్‌ ఆర్డర్‌ చేశాడు. అనంతరం క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డన్‌ను క్యాన్సిల్‌ చేశాడు. ఈ క్రమంలో తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ను వెతికి కాల్‌ చేశాడు.

ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత సమస్య గురించి ఆడిగాడు. డబ్బులు చెల్లించాలంటే తాము పంపిన లింక్‌ను క్లిక్‌ చేసి మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. దానికి సమ్మతించిన యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాంట్లో బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను పొందుపరిచాడు. ఈ క్రమంలో ఓ ఓటీపీ రాగా, అది ఎంటర్‌ చేస్తే డబ్బులు రిఫండ్ అవుతాయని నమ్మించాడు. దీంతో ఆ యువకుడు ఓటీపీని ఎంటర్‌ చేశాడు. వెంటనే అతని అకౌంట్‌లో ఉన్న రూ.4లక్షలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగుతిన్న యువకుడు మరలా ఆ నెంబర్‌కు కాల్‌ చేయగా.. ఎటువంది స్పందన రాలేదు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top