మూడో పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రుల హత్య

Man Kills Parents For Denying Marriage With Facebook Friend - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయితో పెళ్లికి నిరాకరించారని ఓ యువకుడు తన తల్లిదండ్రులను హత్య చేశాడు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాదీమ్‌ అహ్మద్‌ (55), తస్లీం బానో (50) కుమారుడు రెహ్మాన్‌ (26)తో కలిసి జామియా నగర్‌లో నివాసముంటున్నారు. రెహ్మాన్‌ కాల్‌ సెంటర్లో పనిచేస్తుండేవాడు. మత్తు పదార్థాలకు బానిస కావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.  

రెహ్మాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా, మూడో పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి వారు ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.  వారి పేరున ఉన్న ఆస్తిని కూడా కాజేయాలనుకున్నాడు. తన తల్లిదండ్రులను హత్య చేసేందుకు నదీమ్‌ ఖాన్‌, గుడ్డూ అనే వ్యక్తులతో రెహ్మాన్‌ రెండున్నర లక్షల రూపాయలకు ఒప్పందం​ చేసుకున్నాడు. వారి సహాయంతో అహ్మద్‌, బానోలను హతమార్చాడు.

ఏప్రిల్‌ 28 వారు నివాసముంటున్న భవనం మొదటి అంతస్తులో​ రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ చిన్మాయ్‌ బిస్వాల్‌ తెలిపారు. బెడ్‌షీట్‌తో ఊపిరాడకుండా చేయడంతో అహ్మద్‌, బానోలు చనిపోయనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయిందని బిస్వాల్‌ తెలిపారు. విచారణలో రెహ్మాన్‌ నేరాన్ని అంగీకరించాడనీ, అతనికి సహాయపడిన ఖాన్‌, గుడ్డూని కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top