భార్యను చంపి.. శవాన్ని బెడ్‌ బాక్స్‌లో..

Man Killed Wife and Hid Body in Bed Box - Sakshi

మరో మహిళను వివాహం చేసుకున్న భర్త

పక్కా ప్లాన్‌తోనే మొదటి భార్య మరియాను హతమార్చడన్న పోలీసులు

డబుల్‌ కాట్‌ బాక్స్‌లో దొరికిన మరియా మృతదేహం

న్యూఢిల్లీ : భార్యను అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బెడ్‌ బాక్స్‌లో దాచిన కసాయి భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వేరొక యువతిని పెళ్లి చేసుకున్న సురేష్‌.. మొదటి భార్య మరియా(30)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాదాపు 18 రోజుల విచారణ అనంతరం మరియా మృతదేహాన్ని బెడ్‌ బాక్స్‌లో గుర్తించినట్లు చెప్పారు. మరియా ఆచూకీ కనిపించడం లేదని సురేష్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో సురేష్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిసిందని, దీనిపై అతన్ని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడని వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top