ఐదేళ్ల కూతురి హత్య.. | Man killed his five year old daughter | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల కూతురి హత్య..

Jan 12 2020 1:51 AM | Updated on Jan 12 2020 5:09 AM

Man killed his five year old daughter - Sakshi

యామిని (ఫైల్‌)

నాగోలు: మద్యం మత్తులో ఓ తండ్రి తన ఐదేళ్ల కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంద్రవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన దుర్గారావు, గంగాభవాని దంప తులకు సింధు (7), యామిని (5) సంతానం. ఎల్‌బీనగర్‌ మన్సూరాబాద్‌ బాలాజీనగర్‌లోని భాస్కర నిలయం అపార్ట్‌మెంట్‌లో దుర్గారావు వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఇళ్ల లో పనిచేస్తోంది. మద్యానికి బానిసైన దుర్గారావు తరచూ భార్య, పిల్లలను కొట్టేవాడు. శుక్రవారం ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో పిల్లలను చంపేస్తానని బెదిరించి పడుకున్నాడు.

శనివారం ఉదయం పనికివెళ్తున్న గంగాభవాని పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లాలని అదే కాలనీలో ఉండే తన సో దరుడికి ఫోన్‌ చేసి చెప్పింది. సోదరుడు వచ్చి సింధూను పాఠశాలకు తీసుకెళ్లా డు. యామినిని తన వద్ద ఉంచాలని దు ర్గారావు కోరడంతో అక్కడే వదిలి వెళ్లా డు. కాగా, భార్యపై కోపంతో దుర్గారావు యామినీని గొంతు నులిమి హత్య చేశాడు. గంగాభవాని ఇంటికి తిరిగి వచ్చేసరికి యామి ని విగతజీవిగా పడి ఉంది. వెంటనే చిన్నారిని ఎల్‌బీనగర్‌లోని లోటస్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. యామిని చనిపోయిన ట్లు ధ్రువీకరించారు. గంగాభవాని ఫిర్యాదుతో  పో లీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement