వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు.. | Man Held in Wild Animals Assassinated Case Anantapur | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులపై టిక్‌టాక్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

May 22 2020 11:40 AM | Updated on May 22 2020 11:40 AM

Man Held in Wild Animals Assassinated Case Anantapur - Sakshi

అనంతపురం, కంబదూరు: వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఓ వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రామగిరి మండలం పేరూరుకు చెందిన నాగార్జున అనే యువకుడు కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన బోయ నరసింహులు అనే వ్యక్తి వద్ద జీతగాడిగా ఉన్నాడు.

రోజూ గొర్రెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లేవాడు. అయితే ఇటీవల నాగార్జున ఓ జింక పిల్లను పట్టుకొని దానిని అడిస్తూ మేక పాలను తాపడం, కుందేళ్లను చంపి దాని మాంసాన్ని కుక్కలను వేయడం వంటి పనులు చేస్తూ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశాడు. వీడియోలను జిల్లా ఫారెస్ట్‌ అధికారి జగన్నాథం చూసి వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని కళ్యాణదుర్గం అటవీ అధికారులను ఆదేశించారు. సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సెక్షన్‌ ఆఫీసర్‌ రామచంద్రనాయక్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement