చితక్కొట్టి.. ముక్కుతో షూను రాయించి.. | Man forced to rub nose on shoes in Mandsaur | Sakshi
Sakshi News home page

చితక్కొట్టి.. ముక్కుతో షూను రాయించి..

Jun 22 2019 11:38 AM | Updated on Jun 22 2019 11:42 AM

Man forced to rub nose on shoes in Mandsaur - Sakshi

మాండోసోర్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వివాహ వేడుకలో ఘర్షణ చోటుచేసుకోవడంతో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితక్కొట్టారు. అక్కడితో ఆగకుండా అతడితో అక్కడున్నవారి షూపై ముక్కుతో రాయించారు. ఈ సంఘటన జున్‌ 16న చోటుచేసుకోగా, దీనికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన జరిగనప్పటి నుంచి బాధితుడు కనిపించకుండా పోయాడు. సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో నింధితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మాండోసోర్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ దిలీప్‌ సింగ్‌ బిల్వాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement