టిక్‌టాక్‌.. తీసింది ప్రాణం! | Man dies trying to swallow live fish | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌.. తీసింది ప్రాణం!

Jun 12 2020 4:52 AM | Updated on Jun 12 2020 5:28 AM

Man dies trying to swallow live fish - Sakshi

వెట్రివేల్‌

హోసూరు: టిక్‌టాక్‌లో పేరుపొందాలనే తపనతో వినూత్నంగా విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్‌ వీడియో తీస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగిన యువకుడు ఊపిరాడక చనిపోయిన సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్‌ కొడుకు వెట్రివేల్‌(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement