యువతిపై లైంగిక దాడి | Man Arrest in Molestation Case Hyderabad | Sakshi
Sakshi News home page

యువతిపై లైంగిక దాడి

Oct 22 2019 12:36 PM | Updated on Oct 22 2019 12:36 PM

Man Arrest in Molestation Case Hyderabad - Sakshi

నిందితుడు మహ్మద్‌ షాజిద్‌

మల్కాజిగిరి: ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమేగాక చంపుతానని బెదిరించిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్, ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ ట్రూవెయిట్‌ న్యూట్రీషియన్‌ సంస్థ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఆన్‌లైన్‌ద్వారా అతడిని సంప్రదించింది. ఈ నెల 10న తమ ప్రతినిధి ఇంటికి వచ్చి డైట్‌ ప్లాన్‌ వివరాలు తెలియజేస్తారని యువతికి సమాచారం అందింది. ఈ నెల 9న కన్సల్టెంట్‌ మహ్మద్‌ షాజిద్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. డైట్‌ ప్లాన్‌ వివరిస్తూనే సదరు యువతిని గదిలోకి తీసుకెళ్లి  లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 13న అతను బాధితురాలికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరించాడు. 16న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు  సోమవారం నిందితుడు షాజిద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement