లాక్‌డౌన్‌ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని..

Man Allegedly Assassinate Brother For Stepping Out During Lockdown In Mumbai - Sakshi

మంబై : లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తిని అతని సోదరుడే హత్య చేశాడు. ఈ ఘటన ముంబైలోని కందివాలిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ‘రాజేష్‌ లక్ష్మి ఠాకూర్‌ అనే వ్యక్తి తన తమ్ముడు దుర్గేష్‌ను హత్యచేశాడు. బుధవారం మధ్యాహ్నం దుర్గేష్‌​ కిరాణ సామాగ్రి తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రాత్రిపూట ఇంటికి తిరిగివచ్చిన దుర్గేష్‌పై రాజేష్‌, అతని భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీంతో రాజేష్‌కు, దుర్గేష్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఆ తర్వాత రాజేష్‌ కత్తితో దుర్గేష్‌పై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డిన దుర్గేష్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దుర్గేష్‌ మృతిచెందాడని వైద్యులు చెప్పారు. దీంతో రాజేష్‌పై హత్య కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నాం’ అని తెలిపారు. దుర్గేష్‌ పుణేలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో అతడు కందివాలిలోని ఇంటికి వచ్చాడు. కాగా, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top