బెజవాడ బందరురోడ్డులో అగ్నిప్రమాదం | Major Fire Accident in showroom at bandar road | Sakshi
Sakshi News home page

బెజవాడ బందరురోడ్డులో అగ్నిప్రమాదం

Oct 17 2017 10:10 AM | Updated on Sep 5 2018 9:47 PM

Major Fire Accident in showroom at bandar road - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డీవీ మనోహర్ హోటల్‌కు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ స్థలానికి ఒక వైపు హోటల్, మరోవైపు షాపింగ్ మాల్ ఉన్నాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణంలో వస్త్రాలు, ఫ్యాషన్ మెటీరియల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఆస్తినష్టం ఎంతమేరకు జరిగిందనే దానికి స్పష్టత లేదు.

Advertisement
 
Advertisement
Advertisement