కొండపై ప్రేమజంట ఆత్మహత్య!

Lovers Suicide in Odisha Dead Bodies Found - Sakshi

అనుమానాస్పద స్థితిలో పోలీసులకు లభ్యమైన యువతీ, యువకుల మృతదేహాలు  

ఒడిశా, బరంపురం: గంజాం–గజపతి జిల్లా సరిహద్ధులోని కొండపై ప్రేమజంట మృతదేహాలను పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఎస్‌డీపీఓ అశోక్‌కుమార్‌ మహంతి తెలిపిన వివారాల మేరకు... ఆర్‌.ఉదయగిరి పోలీసు స్టేషన్‌ పరిధి కుమ్మరి వీధి సమీపంలో ఉన్న కొండలపై యువతీ, యువకుల మృతదేహాలు ఉన్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. దీనిపై వెళ్లి, వెతకగా.. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఇద్దరి మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. చనిపోయి చాలా రోజులై ఉంటుందని, అటవీ జంతువులు శరీర భాగాలను తీవ్రంగా గాయ పరిచాయని తెలిపారు. ప్రేమజంటగా అనుమానిస్తున్న వారికి సమీపంలో దుస్తుల బ్యాగ్, పాయిజన్‌ బాటిల్‌ను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అనుమాన్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు దొరికితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎస్‌డీపీఓ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top