పెద్దలు ప్రేమ పెళ్లికి నిరాకరించారని.. | Lovers Suicide Attempt In Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Feb 20 2019 7:05 PM | Updated on Feb 20 2019 7:05 PM

Lovers Suicide Attempt In Tamilnadu - Sakshi

టీ.నగర్‌: కుంభకోణం సమీపాన గల కావర్‌కూడం అంబలక్కార వీధికి చెందిన రవికుమార్‌ కుమారుడు చంద్రన్‌ (20). ఇదే ప్రాంతానికి చెందిన రత్నం కుమార్తె రంజిత (19). వీరిద్దరూ ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే చంద్రన్, రంజితకు చిన్నాన్న వరస కావడంతో ఇరు కుటుంబాలు వీరి వివాహానికి సమ్మతించలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమజంట ఈ నెల 16వ తేదీన విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇరువురిని బంధువులు వెంటనే కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

తరువాత మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని తంజావూరుకు వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత సోమవారం రాత్రి మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రన్‌కు చికిత్సలు అందిస్తున్నారు. దీనిపై స్వామిమలై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement