ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి | The lion's death in the ARC | Sakshi
Sakshi News home page

ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి

Apr 14 2018 1:47 PM | Updated on Apr 14 2018 1:47 PM

The lion's death in the ARC - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం (ఏఆర్‌సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

దీని గర్భాశయం పాడయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని జూ ఇన్‌చార్జి క్యూరేటర్‌ బి.జానకిరావు తెలిపారు. దీనిని 2002 జూన్‌ 12న కోల్‌కతాలో ఫేమస్‌ సర్కస్‌ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. 

జూలో బేబీ బైసన్‌ మృతి 

ఆరిలోవ(విశాఖతూర్పు): జూ పార్కులో వారం రోజుల క్రితం పుట్టిన బైసన్‌(అడవిదున్న) పిల్ల శుక్రవారం మృతి చెందింది. ఇక్కడ అనుష్క అనే బైసన్‌కు ఈ నెల 6న పిల్ల పుట్టింది. ఇది పుట్టిన నుంచి నీరసంగా ఉండటంతో పాటు తల్లి వద్ద పాలు సరిగా తాగేది కాదు.

దీంతో నీరసించిపోయింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇది మృతి చెందింది. తల్లి బైసన్‌ కాళ్లతో తొక్కేయడంతో ఈ పిల్ల మృతి చెందినట్లు ఇక్కడ వైద్యులు గుర్తించారు. దీని పొట్టపై తల్లి బైసన్‌ కాళ్లతో తొక్కేసిన పెద్ద గాయాలున్నట్లు గుర్తించామని వైద్యుడు శ్రీనివాస్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement