అది కిడ్నాప్‌ కాదు.. డ్రామా | kidnap is drama | Sakshi
Sakshi News home page

Dec 22 2017 11:27 AM | Updated on Dec 22 2017 11:29 AM

సాక్షి, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో ఆరుగురు విద్యార్థుల కిడ్నాప్‌ ఉదంతాన్ని పోలీసులు డ్రామాగా తేల్చారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశ, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సాయంత్రం సమ్మెటివ్‌ పరీక్షలు ముగిసిన తర్వాత తనకు కడుపునొప్పి ఉందని ఫర్జానా అనే విద్యార్థిని  చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలిసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో వచ్చిన దుండగులు వీరిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులు విచారించగా కిడ్నాప్‌ డ్రామాగా తేలింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని సరోజిని, క్లర్క్‌ శశికళ మధ్య విభేదాలతోనే ఈ డ్రామా నడిచినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎం సరోజనియే విద్యార్థినులతో కిడ్నాప్‌ డ్రామా ఆడించినట్లు, కేసును శశికళపై నెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కాగా, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement