అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు | Police crack the Attapur kidnapping case | Sakshi
Sakshi News home page

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు

May 20 2026 3:42 PM | Updated on May 20 2026 3:52 PM

Police crack the Attapur kidnapping case

సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్‌ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్‌పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్‌గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ ‍చేశారు. మహేంద్రా థార్‌లో వచ్చిన నలుగురు  యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..

వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.

ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement