చెప్పుల్లో దాచిన రూ.7 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Kerala Man Arrested At  Kannur Airport Hashish Hidden In Slippers - Sakshi

తిరువనంతపురం : సుమారు ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కన్నూరు అంతర్జాతీయ విమాన్రాశయ అధికారులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. కన్నూరు జిల్లా థాయథేరు ప్రాంతానికి చెందిన అజయ్‌ వలియబల్లథ్‌ అనే వ్యక్తి దోహా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన చెప్పుల్లో గంజాయి దాచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులకు అనుమానం వచ్చి చెక్‌ చేయడంతో రూ. 7 లక్షల విలువ చేసే గంజాయి బయటపడింది. అజయ్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం అతన్ని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top