పాపం ఏ కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం

బెంగళూరు : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయిన సంఘటన కర్ణాటకలోని కొప్పాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త, భార్య, వారి నలుగురు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన వారిని శేఖరయ్య బీద్నల్(42), అతడి భార్య జయమ్మ(39), కుమార్తెలు.. బసమ్మ(23), గౌరమ్మ(20), సావిత్రి (18), పార్వతి (16)లుగా గుర్తించారు. మొదటి ఇద్దరు కుమార్తెలకు వివాహాలైనట్లు సమాచారం.
శేఖరయ్య ముందుగా తన భార్య, నలుగురు కుమార్తెలకు విషం ఇచ్చి తర్వాత అతడు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించినట్లు భావిస్తున్నారు. పంటలు పండకపోవడం వల్ల బ్యాంకు రుణాలతో కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.