బంధువుల మెప్పు కోసం...

Jharkhand Woman Robs Car To Impress Relatives - Sakshi

డెహ్రడూన్‌ : బంధువుల మెప్పు కోసం.. వారి ముందు ధనవంతులుగా గుర్తింపు పొందడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు ఓ జంట. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రడూన్‌కి చెందిన సప్న(26) పేద కుటుంబానికి చెందిన మహిళ. ఇమెకు 2009లో వివాహం అయ్యింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయి వర్మ అనే మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సప్న సోదరునికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వచ్చే తన బంధువుల ముందు తాను గొప్పగా కన్పించడం కోసం కారులో వెళ్లాలని భావించింది.

ఇందుకోసం డెహ్రడూన్‌కు చెందిన శుభం శర్మ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి తమను ఢిల్లీ తీసుకెళ్లి.. తిరిగి డెహ్రడూన్‌కి చేర్చేలా కిరాయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న సప్న, వర్మలు మరో స్నేహితురాలితో కలిసి టాక్సీలో ఢిల్లీ బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత సప్న, వర్మ తమ దగ్గర ఉన్న తుపాకీతో టాక్సీ డ్రైవర్‌ను బెదిరించి కారు తీసుకుని పారిపోయారు. టాక్సీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సప్న, వర్మలను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top