Impress
-
అలా శిల్పాశెట్టిని ఇంప్రెస్ చేసిన రాజ్‌కుంద్రా
Raj kundra-Shilpa shetty love story: రాజ్‌కుంద్రా.. గత కొన్నిరోజుల నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలోనూ కుంద్రా భాగోతంపై జోరుగా చర్చ నడుస్తుంది. లండన్‌కు చెందిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ ఇండస్ర్టీ ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ఇక భర్త అరెస్ట్ అనంతరం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్‌కుంద్రా అప్పటి స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని ఎలా వల్లో వేసుకున్నారన్నదానిపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. రాజ్ కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. దీంతో 18 ఏళ్ల వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా..మొదట శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టి లాభాలు ఆర్జించాడు. ఆ సమయంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ చేస్తూ సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ డీల్ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడట. ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్‌లోనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్‌కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్ శిల్పాకు ఊహించని షాక్ ఇచ్చింది. -
ఆన్‌లైన్‌కు ‘ఎక్స్‌పీరియెన్స్’!
సాక్షి, బిజినెస్ విభాగం:ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నా... ఇప్పటికీ ఏదైనా ఉత్పత్తిని కొనుక్కోవాలంటే స్వయంగా చూసి, సంతృప్తి చెందాకే కొనేవారి సంఖ్యే ఎక్కువ. వీళ్లంతా ఆఫ్‌లైన్ స్టోర్స్‌కే ఓటేస్తుంటారు. ఆన్లైన్ సంస్థలు కూడా దీన్ని గుర్తించాయి. అందుకే... ఈ కస్టమర్స్‌కు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఏడాదిలో 11 స్టోర్స్.. ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌కు అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దుస్తులు, ఫర్నిషింగ్స్ రిటైల్ సంస్థ ఫ్యాబ్ ఇండియా ఏడాది వ్యవధిలోనే 11 సెంటర్స్‌ను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 30 సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. డిజిటల్ ప్రపంచానికే పరిమితమైన పెప్పర్ఫ్రై వంటి బ్రాండ్లు కూడా కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉపయోగిస్తున్నాయి. కొనుగోలుదారులు తాము కొనుక్కోవాలనుకునే ఫర్నిచర్‌ను తాకి, చూసి, అనుభూతి చెందాలనుకుంటున్నారని... అందుకే తామూ ఆఫ్‌లైన్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ బాట పట్టామని సంస్థ వర్గాలు తెలిపాయి. కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫర్నిచర్‌ను ఎంచుకునేందుకు పెప్పర్ఫ్రై స్టూడియోస్ తోడ్పడుతున్నాయని, చూడటానికి వచ్చే వారిలో 50 శాతం మందికి పైగా కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో పెప్పర్ఫ్రై తమ ఆఫ్‌లైన్ వ్యూహాన్ని మరింత భారీగా విస్తరిస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఆఖర్లో 29 స్టూడియోస్ ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 52కి చేరింది. అదే బాటలో చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థలు.. ఆన్లైన్ మాధ్యమం ద్వారా అరంగేట్రం చేసిన వన్ ప్లస్ తొలిసారిగా బెంగళూరులో ఎక్స్పీరియన్స్ స్టోర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు చెన్నై, ఢిల్లీలో కూడా ప్రారంభించింది. భారతీయ కొనుగోలుదారులు ఏదైనా కొనడానికి ముందు నేరుగా చూడటానికే ప్రాధాన్యమిస్తారని.. అందుకే ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ప్రీమియం కొనుగోలుదారులు తాము కొనుక్కునే ఉత్పత్తికి సంబంధించి అదనపు హంగులు కూడా కోరుకుంటారని.. అందుకే ప్రీమియం కాఫీ ఇవ్వడం వంటి సేవలు అందించడం ద్వారా ప్రత్యేక అనుభూతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వన్ ప్లస్ పోటీ సంస్థ షావోమీ కూడా ఇదే తరహాలో చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో అయిదు ఎంఐ హోమ్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవలే రీలాంచ్ చేసిన జావా బైక్ బ్రాండ్ సంగతి తీసుకుంటే.. వీటి స్టోర్స్‌కి వచ్చే కొనుగోలుదారులు ఆయా బైక్‌ల పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవచ్చు. జావా సంబంధ టీ షర్టులు, యాక్సెసరీస్‌ను కొనుక్కోవచ్చు. లేదా లోపలే ఏర్పాటు చేసిన చిన్న పాటి లైబ్రరీలో పుస్తకాలు తిరగేయొచ్చు. అమ్మకాల్లోనూ వృద్ధి .. ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌తో అమ్మకాలూ గణనీయంగానే పెరుగుతున్నాయి. సాధారణంగా స్టోర్‌ను రీడెవలప్ చేస్తే అమ్మకాల వృద్ధి 6–7 శాతం మేర ఉంటుందని, కానీ ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌తో 30 శాతం దాకా వృద్ధి ఉంటోందని ఫ్యాబ్ ఇండియా వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆన్లైన్ ఆర్డరుతో పోలిస్తే తమ స్టూడియోకి వచ్చే వినియోగదారులిచ్చే ఆర్డరు విలువ సగటున మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందని పెప్పర్ఫ్రై వర్గాలు తెలిపాయి. తమ ఆదాయాల్లో దాదాపు 30 శాతం వాటా స్టూడియోస్ నుంచే ఉంటోందని వివరించాయి. స్టూడియో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అమ్మకాలు 90–100 శాతం దాకా కూడా పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపాయి. ఆదాయాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ వాటాను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 45 శాతానికి పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. సాధారణంగా ఇంటి అలంకరణ, లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్ చాలా ఏళ్లుగా ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటి ద్వారా తాము అందించే విస్తృత శ్రేణిని ఒకే దగ్గర షోకేస్ చేసేందుకు వీలవుతుందని రోకా బాత్రూమ్ ప్రొడక్ట్స్ వర్గాలు తెలిపాయి. 50,000 చ.అ.లకు మించిన విస్తీర్ణం ఉండేలా భారీ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్ కుమార్ పేర్కొన్నారు. అయితే, కేవలం ఉత్పత్తులను డిస్ప్లే చేయడం, ధరల విషయాల గురించి తెలియజేయడం మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ ఉద్దేశం కాదు. కొనుగోలుదారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపింగ్ అనుభూతినివ్వడమే వీటి లక్ష్యమని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
బంధువుల మెప్పు కోసం...
డెహ్రడూన్ : బంధువుల మెప్పు కోసం.. వారి ముందు ధనవంతులుగా గుర్తింపు పొందడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు ఓ జంట. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రడూన్‌కి చెందిన సప్న(26) పేద కుటుంబానికి చెందిన మహిళ. ఇమెకు 2009లో వివాహం అయ్యింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయి వర్మ అనే మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సప్న సోదరునికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వచ్చే తన బంధువుల ముందు తాను గొప్పగా కన్పించడం కోసం కారులో వెళ్లాలని భావించింది. ఇందుకోసం డెహ్రడూన్‌కు చెందిన శుభం శర్మ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి తమను ఢిల్లీ తీసుకెళ్లి.. తిరిగి డెహ్రడూన్‌కి చేర్చేలా కిరాయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న సప్న, వర్మలు మరో స్నేహితురాలితో కలిసి టాక్సీలో ఢిల్లీ బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత సప్న, వర్మ తమ దగ్గర ఉన్న తుపాకీతో టాక్సీ డ్రైవర్‌ను బెదిరించి కారు తీసుకుని పారిపోయారు. టాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సప్న, వర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సురభి .. మాయాజాలం
కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్ గ్రాఫిక్స్లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్పెషల్ ఎఫెక్ట్స్‌తో రంగ స్థలంపై మంటలు పుట్టించడం, వర్షం కురిపించడం, వస్తువులను అదశ్యం చేయడం.. ఔరా అనిపించాయి. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్ ప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖ–కల్చరల్: కళాభారతి ఆడిటోరియంలో బుధవారం సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. రంగసాయి నాటక సంఘం నేతత్వంలో మూడు రోజులపాటు జరిగే సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా తొలిరోజు మాయాబజార్ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వర నాట్యమండలి(సురభి–హైదరాబాద్) కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అబ్బురపరిచిన సెట్టింగ్‌లు ఈ నాటకంలో ఘటోత్కచుడు గుహ సెట్టింగ్ ఆకట్టుకుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మాయా యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్ర ప్రభావంతో మంటలు, నీరు స్టేజ్‌పై ఆకస్మాత్తుగా రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒకే వేదికపై శశిరేఖ–అభిమన్యుడు వేర్వేరు దశ్యాలలో విరహ గీతాలాపన మైమరిపించింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, శశిరేఖ, అభిమన్యుడు, నారదుడు తదితర పాత్రల్లో ఆయా కళాకారులు చక్కటి ఆహార్యంతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ పద్యాలు పాడుతూ రక్తికట్టించారు. ప్రతి కళాకారుడు మనస్సుకు హత్తుకుపోయే విధంగా ప్రదర్శించి ఆయా పాత్రల్లో లీనమైపోయారు. మల్లాది వేంకటకృష్ణ శర్మ దర్శకత్వంలో ఎ.మనోహార్, ఆర్.నాగేశ్వరరావు(బాబ్జీ)ల నిర్వహణలో అద్భుత దృశ్యాలు సష్టించారు. వెంకటేశ్వరరావు సారథ్యంలో 65 మంది కళాకారులు ఈ నాటకానికి జీవం పోశారు. తొలుత ఈ నాటక ప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, టి.సరస్వతీదేవి, ఆదాయ పన్నుల శాఖ అధికారి హర్షవర్థన్, సురభి రథసారథి బాబ్జీ, రంగసాయి నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్ సాయి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
ఆకట్టుకున్న స్టూడెంట్స్ ఫ్యాషన్
-
బన్నీని ఇంప్రెస్ చేసిన అందాలరాక్షసి
-
లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే..
ముంబై: 'మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా' అంటూ ముందు కొద్ది రోజులపాటు పాటలు పాడుకున్నా తర్వాత ఏదో ఒకలా తమ మనసుకు నచ్చిన వ్యక్తిని బాయ్ ఫ్రెండ్‌గా దగ్గర చేసుకోగలరు అమ్మాయిలు. వారిని చూపులతో ఇట్టే కట్టేయగలరు. కానీ, పూర్తిగా సొంతం చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆ బాయ్ ప్రెండ్స్ తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. కానీ ఇది పెద్ద సాహసమే. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్స్‌ను మెప్పించినంత ఈజీ కాదు వారి తల్లిదండ్రులను ఒప్పించడం. మెప్పించడం సంగతీ దేవుడెరుగు.. కనీసం వారి ముందుకు వెళ్లే సాహసం కూడా చేయలేరు. అయితే, ఇదంతా కేవలం కొన్ని విషయాలపై అవగాహన లేక జరుగుతుందని, కొన్ని కిటుకులను అనుసరించడం ద్వారా వారి మనసును కూడా బాయ్ ఫ్రెండ్స్ మనసులకన్నా వేగంగా కట్టేయోచ్చంటున్నారు. ఒక్కసారి ఆ కిటుకులేమిటో చూస్తే.. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా.. అందుకే హుందాగా ఉండటమే కాకుండా కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే వారు చూపు మీపై నిలుస్తుందట. అలాగే, తొలిసారి కలిసేందుకు వెళుతున్నప్పుడు కాబోయే అత్తమామలకు కచ్చితంగా చేతిలో బహుమతి ఉండాలంటున్నారు. ఇక ఇంటర్వ్యూకు వెళ్లినట్లుగానే ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్లాలట. గబగబా మాట్లాడకుండా వారేం మాట్లాడుతున్నారో సావధానంగా వినాలి. ఇంకా, ఆ సమయంలో అమ్మాయి మాట్లాడే మాటల్లో అబ్బాయిపైనే ఊహలున్నట్లుగా ఉండటంతోపాటు, అన్ని తెలిసిన అమ్మాయిలా ప్రవర్తించకూడదు. అబ్బాయిపక్కనే కూర్చోవలటకానీ చేతులు వేయకూడదని అంటున్నారు. గతంలో ఏవైన వాస్తవాలు తెలిసి ఉన్నా వాటిని ప్రస్తావించకుండా ఉంటాలట. మాట్లాడేముందు తప్పినిసరిగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడితే మంచి ఇంప్రెషన్ ఉంటుందట. ఇన్ని చేసినా చివరికి వాళ్లు ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మరో అవకాశం వారికిచ్చేలాగా మనసును సరిచేసుకోవాలేగానీ వారిపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పరుచుకోకూడదట. ఇప్పుడు తెలిసిందిగా అమ్మాయిలు.. ఇక ఫాలో అయిపోండి. -
దిస్ ఈజ్ నాట్ కరెక్ట్
కుళ్లు జోకులు తనకు నచ్చవంటున్నారు ఆమిర్‌ఖాన్. తనను ఇంప్రెస్ చేయాలంటే ఎదుటివారిని కించపరచేవి కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుకునే జోకులు వేస్తే చాలంటున్నాడీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇటీవల ఏబీఐ నాకౌట్ ఫీచరింగ్ ఓ వర్గాన్ని కించపరచేలా ఉందంటూ వచ్చిన వార్తలపై అమీర్ పైవిధంగా స్పందించాడు. సదరు కార్యక్రమంలో పాల్గొన్న డెరైక్టర్ కరణ్ జోహార్, నటులు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడటం లేదంటూనే.. ఇలాంటి ప్రోగ్రామ్స్ రూపొందించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు.