కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా.. | Hyderabad Police Take to media Keerthi And Shashi Kumar Today | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని తల్లిని చంపిన కూతురు కేసు

Oct 31 2019 10:47 AM | Updated on Oct 31 2019 10:47 AM

Hyderabad Police Take to media Keerthi And Shashi Kumar Today - Sakshi

కీర్తికి అబార్షన్‌ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది.

హయత్‌నగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లిని హతమార్చిన కుమార్తె కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్‌ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీసి తల్లిని చంపేందుకు ప్రేరేపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

సీసీ కెమెరాల పుటేజీలు, సాంకే తిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగులోకి వచ్చి నాలుగు రోజులైనా దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. కాగా మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్‌ తీసుకెళ్లి అక్కడ కీర్తికి అబార్షన్‌ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement