
భార్య లత కుమారుడి ముందే దొడ్డయ్యను కొట్టింది.
కర్ణాటక, యశవంతపుర: భార్య కొట్టడంతో అవమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దాసరహళ్లి కోకోనట్ గార్డెన్‌లో జరిగింది. కోకోనట్ గార్డెన్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న దొడ్డయ్యకు (45) పదేళ్ల క్రితం లతతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య లత కుమారుడి ముందే దొడ్డయ్యను కొట్టింది. దీనిని అవమానంగా భావించిన దొడ్డయ్య ఆదివారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.