భార్యపై అనుమానం.. కత్తితో విచక్షణా రహితంగా.. | Husband Attacked Wife With Knife In Krishna District | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం.. కత్తితో విచక్షణా రహితంగా..

Sep 21 2018 10:25 AM | Updated on Sep 21 2018 10:25 AM

Husband Attacked Wife With Knife In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని నూజివీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం వేంకటాయపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మపై అనుమానంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు.

తీవ్ర గాయాలపాలైన కనకమ్మ పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భుక్కా భీముని కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement