బాలికపై ఇంటి యజమాని లైంగికదాడి | House Owner Molestation on Girl in Hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై ఇంటి యజమాని లైంగికదాడి

May 3 2019 6:39 AM | Updated on May 3 2019 6:39 AM

House Owner Molestation on Girl in Hyderabad - Sakshi

సనత్‌నగర్‌: ఓ బాలికపై ఇంటి యజమాని లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహమూబ్‌నగర్‌ కోస్గి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం నగరంలోని బల్కంపేట ప్రాంతానికి వచ్చి స్థిరపడింది. భర్త చనిపోవడంతో భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుమార్తెను (10)ను చదివిస్తోంది. స్థానిక దాసారం బస్తీలో ఉంటున్న వీరు బుధవారం ఇల్లు ఖాళీ చేసి బల్కంపేట బీజేఆర్‌నగర్‌ ప్రాంతంలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. గురువారం ఉదయం తల్లి పనిలోకి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన ఇంటి యజమాని నిమ్మగడ్డ రామ్‌ప్రసాద్‌ నామెను ఇంట్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న రామ్‌ప్రసాద్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement