విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్‌ | Guntur Student Photo Case Seven More Arrested | Sakshi
Sakshi News home page

విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్‌

Jul 6 2020 6:51 PM | Updated on Jul 6 2020 8:28 PM

Guntur Student Photo Case Seven More Arrested - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ ‌మీడియాలో అప్‌లోడ్‌ చేసిన కేసులో మరో ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన కౌశిక్‌లను దిశా పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.  విద్యార్థిని ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి.. బాధితురాలి దగ్గర నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే విద్యార్థిని న్యూడ్ వీడియోలను మణికంఠ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నుంచి పోస్ట్‌ చేసినట్లు తేలింది. ఈ ఘటనలో వరుణ్, కౌశిక్‌ల తరువాత  మణికంఠ, ధనుంజయ్ రెడ్డి, కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. (420.. దొరికాడు?)

‘మైనేమ్ ఈజ్ 420’ అనే పేరుతో మణికంఠ ఓ ఖాతాను ఓపెన్ చేశాడు.  బాధితురాలి నగ్న వీడియోలను ఆసరాగా చేసుకుని మరింత మంది అమ్మాయిలు వీడియో లు పంపాలని వత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే వారి బండారం బయటపడింది. నిందితులు ఉపయోగించిన లాప్ టాప్, ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందని త్వరలోనే అభియోగపత్రం దాఖలు చేస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement