క్వారెంటైన్‌లో వ్యాపారవేత్త ఆత్మహత్య | Gujarat Business Man Hangs Himself In Quarantine Center | Sakshi
Sakshi News home page

క్వారెంటైన్‌లో వ్యాపారవేత్త ఆత్మహత్య

Apr 4 2020 10:36 AM | Updated on Apr 4 2020 10:42 AM

Gujarat Business Man Hangs Himself In Quarantine Center - Sakshi

గాంధీనగర్‌ : స్వీయ నిర్బంధంలో ఉన్న ఓ కరోనా అనుమానితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త వినోదాబాయ్‌ (44) కరోనా లక్షణాలతో కనిపిండంతో వైద్యులు అతన్ని ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. అయితే వీటిల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. అయినా కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు అతనికి సూచించారు. ఈ క్రమంలోనే వినోదాబాయ్‌ తన నివాసంలోన్నే క్వారెంటైన్‌ సెంటర్‌గా మార్చుకున్నారు.

దాదాపు 13 రోజుల పాటు నిర్బంధంలో కొనసాగిన అతని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఇంటి సీలింగ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును ప్రారంభించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు వచ్చాయన్న కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement