పెళ్లి రోజే వరుడు పరారీ | Groom Escape On Wedding Time | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే వరుడు పరారీ

Mar 30 2018 8:27 AM | Updated on Mar 30 2018 8:27 AM

Groom Escape On Wedding Time - Sakshi

యాకుత్‌పురా:కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు పరారైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ గౌస్‌ కుమార్తె హసినా ఫాతిమాకు, ఆసిఫ్‌నగర్‌ జిర్రా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షరీఫ్‌తో వివాహం కుదిరింది.

ఈ నెల 29న  నాంపల్లిలోని ఓ మసీద్‌లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేగాక ఒప్పందం ప్రకారం  పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కట్నకానుకలను అందజేశారు.అయితే గురువారం పెళ్లి కుమారుడు షరీఫ్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరీఫ్‌ కుటుంబ సభ్యులకు 15 తులాల బంగారు ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ముందుగానే అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement