గో-కార్ట్‌ రేస్‌.. ఊహించని ప్రమాదం

Go-Kart Race Punjab woman killed after her hair gets stuck - Sakshi

సాక్షి, ఛండీగఢ్‌ : సరదాగా బయట గడిపేందుకు వెళ్లిన ఈ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గో-కార్ట్‌ రేసులో ఊహించని రీతిలో ప్రమాదం జరగటంతో 28 ఏళ్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భయానక ప్రమాదంతో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో హాహాకారాలతో దద్దరిల్లిపోయింది.

వివరాల్లోకి వెళ్లితే... పంజాబ్‌కు చెందిన రామ్‌పుర ఫూల్‌లోని బత్తిండకు చెందిన పునీత్‌, తన భర్త అమర్‌దీప్‌ సింగ్‌, రెండేళ్ల కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం పింజోరేలోని యాదవీంద్ర గార్డెన్స్‌కు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాక అంతా గో-కార్ట్‌ రేసుకు సిద్ధమయ్యారు. భర్త ఆమె ఓ కారులో కూర్చోని ముందుకు వెళ్లారు. మొదటి లాప్‌ పూర్తయ్యాక ఒక్కసారిగా పునీత్‌ జుట్టు కారు చక్రంలో ఇరుక్కుపోయింది.

వేగం ఎక్కువగా ఉండటంతో భర్త వాహనాన్ని నియంత్రించలేకపోవటంతో ఒక్కసారిగా ఆమె జుట్టుతోపాటు తల పైభాగం కాస్త ఊడిపోయి చట్రంలోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా హహకారాలు చేస్తూ పరుగులు తీశారు. వెంటనే నిర్వాహకులు కొందరు వాహనాన్ని అదుపు చేసి.. స‍్పృహ కోల్పోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న​ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఊహించని ఈ దుర్ఘటనతో పునీత్‌ కుటుంబంలో విషాదం నెలకొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top