బాలికపై ఏడాదిగా అత్యాచారం | girl was raped by man from one year | Sakshi
Sakshi News home page

బాలికపై ఏడాదిగా అత్యాచారం

Mar 4 2018 6:26 PM | Updated on Aug 1 2018 2:31 PM

girl was raped by man from one year - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రామాయంపేట(మెదక్‌): బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న మండలంలోని కాట్రియాలకు చెందిన సంతోష్‌రెడ్డి అనే యువకునిపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..సంతోష్‌రెడ్డి మండలంలోని లక్ష్మాపూర్‌లో డిష్‌ నడిపిస్తాడు. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి మోసగించి ఏడాదిగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తన తల్లికి తెలపడంతో, ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement