చిన్నారిని చిదిమేసిన గుర్తుతెలియని వాహనం | Girl Child Dead in Vehicle Accident Hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన గుర్తుతెలియని వాహనం

Feb 8 2019 10:05 AM | Updated on Feb 8 2019 10:05 AM

Girl Child Dead in Vehicle Accident Hyderabad - Sakshi

మృతి చెందిన శ్రేష్ట (ఫైల్‌)

హస్తినాపురం:ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపిన మేరకు..కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్‌ గ్రామానికి చెందిన తుకారం తన భార్య సబిత, కూతురు శ్రేష్ట  తో కలిసి  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయినాధ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. తుకారాంఏకైక కూతురు శ్రేష్ట (16నెలలు) గురువారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తలకు  తీవ్రంగా గాయాలు కావడంతో  చిన్నారిని చికిత్స నిమిత్తం చింతలకుంటలో గల రెయింబో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చిన్నారి శ్రేష్ట  మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి తుకారాం íఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చుట్టుప్రక్కల కాలనీలతోపాటు విజయవాడ జాతీయరహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఆవాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement