ఫుట్‌పాత్‌పై మాజీ కెప్టెన్‌.. దారుణ హత్య | Former Army Captain Murdered in Pune | Sakshi
Sakshi News home page

Feb 4 2018 8:38 AM | Updated on Oct 8 2018 5:45 PM

Former Army Captain Murdered in Pune - Sakshi

రవీంద్ర బాలి (పాత చిత్రం)

పుణే : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న ఆర్మీ మాజీ కెప్టెన్‌ ఒకరు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కిరాతకంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. 

లష్కర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సైన్యంలో విధులు నిర్వహించి రిటైర్‌ అయిన కెప్టెన్‌ రవీంద్ర బాలి(67) చాలా కాలం క్రితమే కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నారు. పుణే కంటోన్మెంట్‌ ఏరియాలోని ఫుట్‌పాత్‌పై ఆయన ఓ చిన్న గుడారం వేసుకుని నివసిస్తున్నారు.  గురువారం రాత్రి ఇద్దరు ఆగంతకులు ఆయనపై దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. పక్కనే ఉన్న ఓ బంగ్లా వాచ్‌మెన్‌ అదంతా చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అధికారులు అక్కడికి చేరుకునే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు.

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు లష్కర్‌ ఎస్సై వెల్లడించారు. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడే ఆయన్ని తొలుత చాలా మంది మతిభ్రమించిన వ్యక్తిగా భావించేవారు. కానీ, ఆయన ఓ ఆర్మీ మాజీ అధికారి అన్న విషయం హత్యకు గురైన తర్వాతే స్థానికులకు తెలిసింది. భారీ భద్రత ఉండే కంటోన్మెంట్‌ ఏరియాలో ఇలాంటి ఘటన జరగటం కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement