ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వారిపై.. | Five People Sleeping On Footpath Crushed To Death In Hisar | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వారిపై..

Nov 21 2018 9:24 AM | Updated on Nov 21 2018 11:46 AM

Five People Sleeping On Footpath Crushed To Death In Hisar - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఫ్లైఓవర్‌పై మృత్యుశకటం..

చండీగఢ్‌ : అతివేగంతో దూసుకెళ్లిన కారు ఐదుగురి ప్రాణాలను హరించింది. హర్యానాలోని హిసార్‌లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఐదుగురు బిహారీ కార్మికులు మరణించారు. అదుపు తప్పిన ఈ వాహనం కార్మికులపైకి దూసుకెళ్లిన అనంతరం ఫ్లైఓవర్‌ పైనుంచి కిందకు పడిపోయినట్టు స్ధానికులు వెల్లడించారు.

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులను గుర్తించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేస్తామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement