బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

five labourers Dead In Fire At Cloth Godown Near Pune - Sakshi

అగ్నిప్రమాదంలో కార్మికులు సజీవ దహనం

పూణె : మహారాష్ట్రలో బట్టల గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో అయిదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. పూణె సమీపంలోని వుర్లీ దేవచి గ్రామంలో గురువారం ఉదయం బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడమే కాకుండా, గోదాంలోని బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top