రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

Jun 8 2018 6:56 PM | Updated on Sep 5 2018 9:47 PM

Fire Accident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని బాంబే హోటల్‌ సమీపంలోని పెయింట్‌ గోడౌన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. పెయింట్స్‌ గోడౌన్‌ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేడి తీవ్రతకు సమీపానికి వెళ్లడానికి కూడా వీలు కాకుండా ఉంది.

మరోవైపు భారీ శబ్ధాలతో పెయింట్‌ డబ్బాలు పేలుతుండటంలో భయాందోళన వాతావరణం నెలకొంది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అధికారులు లోకల్‌ ట్రైన్స్‌ను నిలిపేశారు. అలాగే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జాం అయింది. కాగా పెయింట్‌ గోదాంకు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement