పోలీసులకు సినీఫైటర్ల ఫిర్యాదు | Fighters Complaint On Thief hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసులకు సినీఫైటర్ల ఫిర్యాదు

Aug 22 2018 9:18 AM | Updated on Sep 4 2018 5:53 PM

Fighters Complaint On Thief hyderabad - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సినీ ఫైటర్లు

విలన్‌ వేషాల్లో అందరికీ దడపుట్టిస్తుంటారు. అలాంటి వారికే ఓ దొంగ చెమటలు పట్టిస్తున్నాడు.

బంజారాహిల్స్‌: వారు సినిమాల్లో ఫైటర్లు... విలన్‌ వేషాల్లో అందరికీ దడపుట్టిస్తుంటారు. అలాంటి వారికే ఓ దొంగ చెమటలు పట్టిస్తున్నాడు. కారు అద్దాలు పగలగొట్టి నగదుతో పాటు మ్యూజిక్‌ ప్లేయర్‌ను ఎత్తుకెళుతుండటంతో నిందితుడిని పట్టుకోవాలని కోరుతూ బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..కమలాపురి కాలనీకి చెందిన రాజేందర్‌ తన కారును రోడ్డు పక్కన పార్కింగ్‌ చేశాడు. తెల్లవారి లేచి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో రూ. 20 వేల నగదు బ్యాగ్, మ్యూజిక్‌ ప్లేయర్‌  చోరీకి గురయ్యాయి. దీంతో అతను సహచరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement