కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి.. | Father Molestation on Daughter in Hyderabad | Sakshi
Sakshi News home page

కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి జైలు

Apr 10 2019 7:55 AM | Updated on Apr 10 2019 7:55 AM

Father Molestation on Daughter in Hyderabad - Sakshi

రంగారెడ్డి జిల్లాకోర్టులు: కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సేషన్స్‌ జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

మీర్‌పేట జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన మహేందర్‌ తరచూ  వేధించడంతో అతడి భార్య భర్తతో పాటు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన మహేందర్‌ 2016 అక్టోబర్‌ 20న మద్యం మత్తులో తన కుమార్తె(15)  పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి వేధింపులు భరించలేక బాధితురాలు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో సాక్షాధారాలు పరిశీలించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి పై విధంగా తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement