తండ్రి స్నేహితుడి ఘాతుకం | Father Friend Molestation on Girl Child in Rangareddy | Sakshi
Sakshi News home page

తండ్రి స్నేహితుడి ఘాతుకం

Jun 26 2020 9:02 AM | Updated on Jun 26 2020 9:02 AM

Father Friend Molestation on Girl Child in Rangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చేవెళ్ల: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం ఇంటికి వెళ్లాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఖానాపూర్‌లో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి(55), బాధితురాలి తండ్రితో కలిసి స్థానికంగా కూలీ పనులు చేస్తుంటాడు. ఒకే గ్రామం కావటంతో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. అయితే, బుధవారం మద్యం మత్తులో ఉన్న జనార్దన్‌రెడ్డి బాలిక తండ్రి కోసం ఇంటికి వెళ్లాడు.

‘మీ నాన్న లేడా అని బాలికను ప్రశ్నించాడు. ఇంట్లో ఎవరులేరని, అమ్మానాన్న పనిమీద బయటకు వెళ్లార’ని బాలిక అతడికి చెప్పింది. దీంతో బాలిక ఒంటరిగా ఉందని గమనించిన జనార్దన్‌రెడ్డి ఆమె చేయి పట్టుకొని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రం ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి పోలీసులకు పిర్యాదు చేశారు. సీఐ బాలకృష్ణ నిందితుడు జనార్దన్‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement