అప్పుల బాధతో  రైతు బలవన్మరణం | Farmer Suicide In Adilabad | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో  రైతు బలవన్మరణం

Jul 13 2018 12:10 PM | Updated on Oct 1 2018 2:36 PM

Farmer Suicide In Adilabad - Sakshi

కాసు పాపయ్య మృతదేహం

లక్సెట్టిపేట(మంచిర్యాల): అప్పుల బాధతో మండలంలోని ఊత్కూరు గ్రామానికి చెందిన రైతు కాసు పాపయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానిక ఎస్సై మదుసుధన్‌రావు తెలిపారు. పాపయ్య సుతారి పనితోపాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండేవాడు. తనకున్న ఎకరం పొలంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగుచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి పత్తి, వరి దిగుబడి తక్కువ రావడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు అప్పులయ్యాడు.

ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల వివాహాలు ఎలా చేసేదని మనస్తాపానికి గురై గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భార్య సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement