ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం | Family Found Dead On IIT Campus In Delhi | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Jul 27 2019 11:24 AM | Updated on Jul 27 2019 11:36 AM

Family Found Dead On IIT Campus In Delhi - Sakshi

న్యూఢిల్లీ : ఐఐటీ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహ్యత చేసుకోవడం కలకలం రేపింది. వివరాలు.. హరియాణకు చెందిన గుల్షన్‌ దాస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం అయ్యింది. ప్రస్తుతం ఢిల్లీ ఐఐటీలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్న గుల్షన్‌ దాస్‌, భార్య, తల్లితో కలిసి క్యాంపస్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలీదు కానీ గుల్షన్‌ దాస్‌ భార్య, తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంట్లోనే మూడు గదుల్లో వీరు ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గుల్షన్‌ దాస్‌ ఇంట్లో సూసైడ్‌ నోట్‌లాంటిది ఏది తమకు దొరకలేదన్నారు పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement