ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్యయత్నం | Family Commits Suicide Attempt Sangareddy | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్యయత్నం

Dec 13 2018 6:29 PM | Updated on Dec 13 2018 7:17 PM

Family Commits Suicide Attempt Sangareddy - Sakshi

సాక్షి, వికారాబాద్‌: తన ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వికారాబాద్‌ జిల్లా మల్కాపూర్‌లో కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు... తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ.. తన ఇద్దరు కూతుళ్లతో సహ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తల్లి మృతి చెందగా ఇద్దరు పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో మల్కాపూర్‌ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement