నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు దుర్మరణం | Engineering Students Died in Car Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం

May 1 2019 6:38 AM | Updated on May 1 2019 12:20 PM

Engineering Students Died in Car Accident - Sakshi

నలుగురు ఇంజనీరింగ్‌ విద్యా ర్థులు దుర్మరణం పాలయ్యారు.

బొమ్మలరామారం(ఆలేరు): కారు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యా ర్థులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ హిం దూ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 16మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో రాత్రి పొద్దుపోయే వరకు వేడుక నిర్వహించుకున్నాడు.

అక్కడే మద్యం కూడా సేవించారు. అనంతరం వారిలో ఐదుగురు విద్యార్థులు (సుమారు 22, 23 సంవత్సరాల వయసు కలిగిన) హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, కొత్తపేటకు చెందిన స్ఫూర్తి, మీర్‌పేటకు చెందిన చైతన్య, కుంట్లూరుకు చెందిన మనీష్‌రెడ్డి, వినీత్‌రెడ్డిలు కలిసి కారులో మండలంలోని నాగినేనిపల్లి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మితిమీరిన వేగం, ఆపై మద్యం సేవించి ఉండడం, మూలమలుపు ఉండడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణీత, స్ఫూర్తి, చైతన్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్‌ రెడ్డి మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని భువనగిరి సీఐ సురేందర్‌రెడ్డి సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement