ఏడు నెలలుగా జీతాలివ్వలేదని..

Employees Kidnap Torture Boss After No Pay For Seven Months - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : నెలల తరడబడి తమకు జీతాలు ఇవ్వలేదన్న కోపంతో తమ యజమానిని కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలపై నలుగురు ప్రైవేట్‌ సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూర్‌లోని హలసూరులో 23 ఏళ్ల సుజయ్‌ ఓ ప్రైవేట్‌ సంస్థను నడుపుతూ గత ఏడు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. తమ బాస్‌ను కిడ్నాప్‌ చేసి పెండింగ్‌ వేతనాలను రాబట్టాలని సంస్ధలో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు బృందంగా ఏర్పడి తమ ప్లాన్‌ను అమలు చేశారు.

తమ యజమాని సుజయ్‌ను మార్చి 21న కిడ్నాప్‌ చేసి తమ స్నేహితుడు నివసించే హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సుజయ్‌ను వేతనాలు డిమాండ్‌ చేస్తూ వేధించిన ఉద్యోగులు ఆయన నుంచి హామీ తీసుకున్న తర్వాత వదిలేశారు. ఉద్యోగుల చెర నుంచి బయటపడిన సుజయ్‌ ఫిర్యాదు చేయడంతో హలసూరు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top