దారుణం : తాగి వచ్చి సొంత కూతురుపైనే..

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో శనివారం దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నీముచ్‌కు చెందిన ఒక వ్యక్తి తన 8 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్ హెల్ప్‌లైన్ సర్వీస్‌కు ఫోన్ చేసి సమాచారమందించినట్లు పోలీసులు వెల్లడించారు.
'అతను నిత్యం తాగి వచ్చి తన కూతురును చితకబాదేవాడు. శనివారం కూడా తాగి వచ్చి కూతురుపై అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. మేము అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో పాప ఒక్కతే ఉందని' జిల్లా ఎస్పీ రాకేష్ మోహన్ శుక్లా పేర్కొన్నారు. వెంటనే బాధితురాలిని మెడికల్ పరీక్ష నిర్వహణకు ఆసుపత్రికి తరలించగా సదరు బాలిక లైంగిక దాడికి గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సత్వర విచారణ జరిపేందుకు జిల్లా సెషన్స్ జడ్జి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి