ప్రాణం తీసిన కునుకు | Driver Died In lorry Accident Chittoor | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన కునుకు

Jun 11 2018 9:51 AM | Updated on Jun 11 2018 9:51 AM

Driver Died In lorry Accident Chittoor - Sakshi

ఆటోలో మృతి చెందిన మేఘ

పూతలపట్టు: విశ్రాంతి లేకుండా డ్రైవింగ్‌ చేయడంతో అలసిపోయిన డ్రైవర్‌ రెప్పపాటు కునుకు తీసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిలోని రంగంపేట క్రాస్‌ వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాన్‌ ఢీకొంది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. లారీ డ్రైవర్‌ టిఫిన్‌ తినేందుకు రంగంపేట క్రాస్‌ సమీపంలోని కోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద లారీని ఆపాడు. చిత్తూరు సాగర్‌ బ్రాయిలర్‌కు చెందిన కోళ్ల వ్యాన్‌ మేఘ(25) శనివారం రాత్రంతా పలు చికెన్‌ సెంటర్లకు కోళ్లను సరఫరా చేశాడు.

ఆదివారం ఉదయం 10 గంటల ప్రాతంలో చిత్తూరు బయలుదేరాడు. కోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. దీంతో డ్రైవర్‌ మేఘ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న కోళ్ల డెలివరి చేసే శ్రీధర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని పాకాల సీఐ రామలింగయ్య, పూతలపట్టు ఎస్‌ఐ మురళీమోహన్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement