breaking news
lory driver
-
ప్రాణం తీసిన కునుకు
పూతలపట్టు: విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడంతో అలసిపోయిన డ్రైవర్ రెప్పపాటు కునుకు తీసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిలోని రంగంపేట క్రాస్ వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాన్ ఢీకొంది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. లారీ డ్రైవర్ టిఫిన్ తినేందుకు రంగంపేట క్రాస్ సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద లారీని ఆపాడు. చిత్తూరు సాగర్ బ్రాయిలర్‌కు చెందిన కోళ్ల వ్యాన్ మేఘ(25) శనివారం రాత్రంతా పలు చికెన్ సెంటర్లకు కోళ్లను సరఫరా చేశాడు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాతంలో చిత్తూరు బయలుదేరాడు. కోల్డ్ స్టోరేజ్ వద్ద నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. దీంతో డ్రైవర్ మేఘ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న కోళ్ల డెలివరి చేసే శ్రీధర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని పాకాల సీఐ రామలింగయ్య, పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బస్సును ఢీకొన్న లారీ
షాబాద్, న్యూస్‌లైన్: లారీ డ్రైవర్ అజాగ్రత్త పదిమంది క్షతగాత్రులవడానికి కారణమైంది. బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆదివారం మండల పరిధిలోని షాబాద్ మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల నుంచి షాద్‌నగర్ వెళ్తోంది. చెన్నైకి చెందిన లారీ కెమికల్ లోడుతో కర్ణాటకకు ముంబై- బెంగళూరు లింకు రోడ్డు మీదుగా వెళ్తోంది. షాబాద్ మండల కేంద్రానికి సమీపంలో లారీ డ్రైవర్ అజాత్త్రతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఏండీ సుల్తాన్, కండక్టర్‌తో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు కావలి రవి, జక్కని కళావతి, శోభ, రజిని, జయమ్మ, సరస్వతి, బాలమణి, వెంకటయ్యలకు గాయాలయ్యాయి. డ్రైవర్ సుల్తాన్‌కు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని షాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంతో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.